/rtv/media/media_files/2025/03/04/rB8nu6NTxkT8FXm6Jqz5.jpg)
Posani Krishna Murali
కడప మొబైల్ కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓబలువారి పల్లే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 14 రోజులు పాటు ఆయనకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే పోసానిపై కేవలం ఒక్క కేసు మాత్రమే కాకుండా వేర్వేరు జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే పోసాని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు.
— 𝐁𝐞𝐚𝐬𝐓🧢 (@BeastOfYSRCP) March 7, 2025
అన్నమయ్య జిల్లా ఓబులవారి PSలో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.#PosaniKrishnaMuralipic.twitter.com/Jztm0hWG7Y
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
రెండు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి..
ఇదిలా ఉండగా పోసాని కృష్ణమురళిపై వేర్వేరు జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నరసరావుపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని విచారించేందుకు కస్టడీ కోరారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో నరసరావు పేట టూ టౌన్ పోలీసులు రెండు రోజుల పాటు పాటు పోసానిని విచారించనున్నారు. ఈ క్రమంలో అతని బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
ఇది కూడా చూడండి:సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!