సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

తీవ్ర జ్వరంతో అసెంబ్లీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. రెస్ట్ తీసుకోకోకుంటే.. యాపిల్ వాచ్ కొనిచ్చి మీ హెల్త్ ను మానిటర్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.

New Update
Minister Nimmala Rama Naidu Nara Lokesh

Minister Nimmala Rama Naidu Nara Lokesh

ఈ రోజు అమరావతిలోని ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అసెంబ్లీకి వచ్చిన నిమ్మల రామానాయుడితో లోకేష్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ఎదురు పడ్డారు. దీంతో రామానాయుడు ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారు. అన్నా  ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచించారు. కొంచెం రెస్టు తీసుకోండి అంటూ జాగ్రత్తలు చెప్పారు. మీరు ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. మీకు నిత్యం కళ్లెదుట పోలవరం.. తనకేమో పాఠశాలల అభివృద్ధి కనిపిస్తుంటుందన్నారు. మీరు రెస్ట్ తీసుకోకోకుంటే.. మీకు యాపిల్ వాచ్ కొనిచ్చి మీ స్లీపింగ్ టైంను వాచ్ ద్వారా మానిటరింగ్ చేయాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
ఇది కూడా చదవండి: TG Politics: కాంగ్రెస్ కు గుడ్ బై.. సిట్టింగ్ ఎమ్మెల్యే బూతుల వర్షం.. వీడియో వైరల్!

అసెంబ్లీలోనూ చర్చ..

అసెంబ్లీలోనూ రామానాయుడు ఆరోగ్యంపై సరదా చర్చ జరిగింది. ''డాక్టర్ రామానాయుడు గారు.. మీరు పని రాక్షసుడు.. ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి.. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు.. ఇది నా రూలింగ్'' అంటూ స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.  జ్వరంతో ఉండి కూడా అసెంబ్లీ సమావేశాలకు నిమ్మల హాజరు అవుతుండడంతో వద్దని మంత్రి లోకేష్, విష్ణుకుమార్ రాజు వారించారు. చేతికి క్యానులాతోనే నేడు అసెంబ్లీ మంత్రి రామానాయుడు హాజరయ్యారు. గోరుగల్లు రిజర్వాయర్ పై సమాధానం ఇచ్చి నిమ్మల తన సీట్లో కూర్చున్న  సందర్భంలో ఈ ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. ‘అప్పటి కల్లా సెట్ అవ్వాలి’

స్పీకర్ స్థానంలో ఉన్న రఘురాం కృష్ణంరాజు మంత్రి నిమ్మల తామరాకు మీద నీటిబొట్టులా సమాధానం చెప్పారని సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. 'అన్నకు బాగోలేదు.. అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు.. చెప్పినా వినడం లేదు.. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా' అంటూ వ్యాఖ్యానించారు. జ్వరం అని నాకు  తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి. జ్వరం తగ్గేవరకు  అసెంబ్లీకి రా వద్దని  రూలింగ్ ఇచ్చి తీరాల్సిందే అధ్యక్షా అంటూ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు