Free Bus Ride : ఏపీ మహిళలకు బిగ్ షాక్..ఫ్రీ బస్ బంద్

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఫ్రీబస్‌ ప్రయాణంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు ప్రయాణం రాష్ట్రమంతా కాదని, జిల్లాల వరకే పరిమితమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

New Update
 Gummadi Sandhya Rani On Free Bus Ride

Gummadi Sandhya Rani On Free Bus Ride

Free Bus Ride : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఫ్రీబస్‌ ప్రయాణంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు రాష్ట్రమంతా కాదన్న మంత్రి సంధ్యారాణి. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకేనని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఏ జిల్లాలోని మహిళలు, ఆ జిల్లాల్లోనే ప్రయాణించాలని, వేరే జిల్లాకు వెళ్తే ఉచిత ప్రయాణం వర్తించదని తేల్చిచెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుందగా ఆ  రాష్ర్టాల మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం లేదని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారం చేపట్టే రాజకీయ పార్టీలు ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి. మరికొన్ని ప్రభుత్వాలు ఇచ్చిన హమీలలో కొన్ని మాత్రమే అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ సాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ తర్వాత తెలంగాణలోనూ అమలు చేస్తోంది. ఇక ఏపీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణః కల్పిస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. అయితే ఇంత వరకు ఆ పథకాన్ని మాత్రం అమలు చేయలేదు. అయితే అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సుపై చేసిన ప్రకటన ఇప్పుడు పెనుదుమారం లేపుతోంది.

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన కీలక హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఈ ఉగాది నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం విధివిధానాలు, అమలు అంశంపై మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తోంది.. ఆ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.

Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
 
'ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం' అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. శాసనమండలిలో సూపర్‌సిక్స్‌ పథకాల అమలును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రస్తావించారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి సంధ్యారాణి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కాకపోతే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉండదన్నారు. తాము ఎన్నికల సమయంలో కూడా మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చామన్నారు మంత్రి సంధ్యారాణి. ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నామని ప్రకటించారు.  మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు.. కాకపోతే అమలు ఎప్పటి నుంచో మాత్రం ప్రకటించలేదు.

Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు