ఆంధ్రప్రదేశ్ Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పవన్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavani Shankari: 8 గంటలు రిస్క్ తీసుకుని 82 మందిని కాపాడిన సబ్ కలెక్టర్! 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 82 మంది వరద బాధితులను కాపాడిన ఏపీ నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకరీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రమాదానికి ఎదురొచ్చి తమను రక్షించిన కలెక్టర్‌కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. భవానీ శంకరీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..! టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో లేళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రేపు ఉదయానికి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు లేళ్ల అప్పిరెడ్డిని తరలిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సాయం వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..! వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..! ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. సీనియర్ నేత గంటా ప్రసాదరావు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్‌కు పంపించారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీని వీడని వాన గండం.. రాబోయే 24 గంటల్లో.. ఏపీని వర్షాలు వీడటం లేదు. రాబోయే 24 గంటల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్.. మరోసారి వరద ముప్పు..! విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పెనుగంచిప్రోలు దగ్గర వరద రహదారిపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn