Floating Stone : ఘాజీపూర్‌ గంగానదిలో తేలుతున్న రామసేతు రాయి

రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ ఉండే ప్రత్యేక రాళ్లతో రామసేతును నిర్మించారని.. పురణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి రాయి ఒకటి గంగానదిలో ప్రత్యక్షమైంది.

New Update
Ram Setu stone floating in the Ganges River in Ghazipur

Ram Setu stone floating in the Ganges River in Ghazipur

రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ ఉండే ప్రత్యేక రాళ్లతో రామసేతును నిర్మించారని.. పురణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి రాయి ఒకటి గంగానదిలో ప్రత్యక్షమైంది. రాముడు తాకిన రాయి అంటూ పూజలు కూడా మొదలయ్యాయి. యూపీలోని ఘాజీపూర్‌ గంగానదిలో ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!

Floating Stone At Ganges River In Ghazipur

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గంగానది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. దీంతో చాలా వస్తువులు తేలుతూ వస్తుంటాయి. ఈ క్రమంలో కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద ఒక రాయి తేలుతూ కనిపించింది.  దీంతో వందలాది మంది భక్తులు గంగాఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రత్యేకమైన రాయికి తాళ్లు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరికొంతమంది శ్లోకాలు పఠిస్తూ అక్కడే సెటిల్‌ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

ఈ రాయి బరువు 3 క్వింటాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత బరువు ఉన్నప్పటికి ఆ రాయి ఏ మాత్రం నీటిలో మునగడం లేదు. అచ్చం రామసేతు రాళ్ల మాదిరిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతి స్వభావానికి భిన్నంగా నీటిలో మునగని రాయి విషయం తెలుసుకున్న భక్తులు, ప్రజలు.. పెద్ద సంఖ్యలో దానిని చూసేందుకు గంగాఘాట్‌కు  తరలివెళ్తున్నారు. ఇదంతా రామ మహిమ..హనుమన్ శక్తి అనుకుంటూ ప్రజలు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.  

Also Read: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు జవాన్లు మృతి

మరోవైపు రెండేళ్ల క్రితం బిహార్​ రాజధాని పట్నాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. రాజ్‌ఘాట్ వద్ద గంగా నదిలో తెలుతున్న ఓ రాయి లభించింది.   ఆ రాయిపై శ్రీరామ్​ అని రాసి ఉండటంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి రామ్ సేతు రాయి అని నమ్ముతూ ఇప్పటికీ దానికి పూజలు చేస్తున్నారు. తాజాగా ఘజీపూర్‌లో కూడా అలాంటి రాయి దొరకడంతో... రామసేతు నిర్మాణానికి ఈ రాళ్లకు సంబంధం ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశావో.. బీ కేర్ ఫుల్ బిడ్డా : ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

puja | ram-sethu | rama | ganga-river | ghazipur-landfill-site | uttarapradesh

Advertisment
Advertisment
తాజా కథనాలు