/rtv/media/media_files/2025/07/19/police-catch-sufari-gang-2025-07-19-18-56-37.jpg)
Police catch Sufari gang
AP Crime : తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, కుటుంబంలో గొడవలకు కారణమవుతున్నాడనే కారణంతో వివాహిత ఓ విలేకరి హత్యకు కుట్రపన్నింది. మర్డర్ కోసం కొంతమందికి సుపారీ ఇచ్చింది. అయితే సుపారీ తీసుకున్న నిందితులు టార్గెట్‌ను కాకుండా మరోక వ్యక్తిపై దాడి చేయడంతో అసలు బాగోతం బయటకు వచ్చింది. దీంతో అరెస్ట్ అయ్యారు. మహిళ, ఆమె ప్రియుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఈకేసుకు సంబంధించి డీఎస్పీ మోహనరావు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరి అనే మహిళకు తునికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. అయితే ఇద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో మూడేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. విడాకులు అయినప్పటికీ తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో న్యాయం చేయాలని నూకేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో నూకేశ్వరికి ఓ ఛానల్‌లో పనిచేసే విలేకరి పరిచయమయ్యాడు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Dowry Harassment
పోలీసుల ద్వారా నూకేశ్వరి సమస్యను పరిష్కరింప జేస్తానని నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.లక్ష నగదు, 6.5 తులాల బంగారం తీసుకున్నాడు. అయితే ఎంతకీ సమస్యను పరిష్కరించకపోవడంతో ఆ విలేకరితో నూకేశ్వరికి గొడవ జరిగింది. దీంతో తన బంగారం, నగదు వెనక్కి ఇవ్వాలని కోరింది. ఆ విలేకరి ఇవ్వకపోవడంతో అతడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విలేకరి నూకేశ్వరికి పైడిరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతడి భార్యకు చెప్పాడు. ఈ విషయంలో నూకేశ్వరి, పైడిరాజు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలు రోజురోజు పెరుగుతుండటంతో దీనికి కారణమైన విలేకరిని హత్య చేయించాలని నూకేశ్వరి, పైడిరాజు పన్నాగం పన్నారు. దీనికోసం తుని ప్రాంతానికి చెందిన కిరాయి రౌడీలు సాకాడ్ అలియాస్ శ్యామ్, కిసరపూడి జాను ప్రసాద్, రాయని రాజ్‌కుమార్‌తో రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న ఆ ముగ్గురు కిరాయి రౌడీలకు విలేకరి ఇంటిని చూపించారు. రౌడీలు అదే రోజు రాత్రి మద్యం సేవించి విలేకరి ఇంటి పక్కన ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
అయితే తాము దాడి చేసింది విలేకరి అనుకున్న రౌడీలు పని పూర్తయిందని, డబ్బులు ఇవ్వాలని నూకేశ్వరిని కోరారు.అయితే రౌడీలు చేసిన పొరపాటును గుర్తించిన నూకేశ్వరి తాము చెప్పిన వ్యక్తిపై కాకుండా మరో వ్యక్తిపై దాడి చేశారని.. డబ్బులు ఇవ్వబోమని ఆమె తేల్చి చెప్పింది. దీంతో రెండోరోజు విలేకరి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నిందితులను సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. వారిని విచారించగా కిరాయి హత్య గురించి బయటపడింది. దీంతో నూకేశ్వరి, పైడిరాజుతో పాటు కిరాయి రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తు్న్నట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!
anakapalle | anakapalle crime | anakapalle crime news | anakapalle-district | anakapalle news | anakapalle latest news | sufari | police-cases