Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,14,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,21,904 క్యూసెక్కులుగా ఉంది.

New Update
10 gates lifted in jurala project Due to Heavy rains

23 gates lifted in jurala project Due to Heavy rains

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,14,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,21,904 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.300 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు సైతం వరద తాకిడి పెరిగింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉండగా.. హిమాయత్ సాగర్  ఇన్ ఫ్లో 1300 క్యూసెక్కులుగా ఉంది.

Also Read : సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశావో.. బీ కేర్ ఫుల్ బిడ్డా : ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

శ్రీశైలం ప్రాజెక్టు....

ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ప్రాజెక్టు కు సైతం వరద పెరిగింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,52,788 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 67,617 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులుగా ఉంది.

Also Read : Olympics: కేంద్రం గుడ్‌న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం

Also Read :  ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి

srisailam-project | srisailam-reservoir | srisailam-dam | srisailam | huge water inflow to jurala project | jurala-project | telangana rains today

Advertisment
Advertisment
తాజా కథనాలు