Alla Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
రానున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నట్లు వైసీపీ నేత మంతెన రామ రాజు కీలక ప్రకటన చేశారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. గ్రాడ్యుయేట్స్ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కోర్టులో ఊరట దక్కింది. గతేడాది నమోదైన క్రిమినల్ కేసును కోర్టు తొలగించింది.ఈ కేసులో వాలంటీర్లు మాకు సంబంధం లేదని తెలపడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది.
పెళ్లి కాని యువకులే టార్గెట్‌గా కొన్ని ముఠాలు పెట్టుకున్నాయి. తాజాగా 40 ఏళ్ల రాయలసీమ వ్యక్తి భీమవరానికి చెందిన పేదింటి యువతిని రూ.4.5లక్షలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ యువతి అక్కడ నుంచి పరారైంది.
అఘోరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న అఘోరి హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని.. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.