Jogi Ramesh: వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

New Update
Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ సీఎం జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలతో జోగి రమేష్ తిరుగుతున్నారు. ఇటీవల నూజివీడు బస్టాండు సెంటర్‌లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని మంత్రి పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలిసి ప్రారంభించారు.

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

గత కొంత కాలం నుంచి వైసీపీలో యాక్టివ్‌గా..

ఆ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పాటు ఊరు మొత్తం ర్యాలీగా కూడా జోగి రమేష్ తిరిగారు. గత కొంత కాలం నుంచి వైసీపీ పార్టీలో అతను యాక్టివ్‌గా లేరు. జోగి రమేష్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు వైసీపీ పార్టీలో యాక్టివ్‌గా లేకుండా టీడీపీ నేతలతో తిరుగుతుంటే.. పార్టీ మారడం ఖాయమని భావిస్తున్నారు. త్వరలో జోగి రమేష్ టీడీపీలో చేరుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

ఇదిలా ఉండగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు. అయితే ఇతనిపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఇతనిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు కూడా అతను హాజరయ్యారు. ఇతని కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కేసు ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ ర్యాలీలో కనిపించడంతో పార్టీ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని కొందరు అంటున్నారు. గతంలో కూడా జోగి రమేష్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది.  

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు