Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
undi

West  Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది.ఓ మహిళ ఇంటికి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేస్తే మృతదేహం బయటపడింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం. ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసి అనే మహిళకు గత  ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే తన ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకుంది.

Also Read: KTR: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!

ఆ ఇల్లు ప్రస్తుతం ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ క్షత్రియ సంస్థ మహిళ ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారా పంపిస్తోంది. ఈ మేరకు మొదటి విడతగా క్షత్రియ సేవా సమితి టైల్స్‌ పంపించగా.. మరోసారి పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రికి  పంపుతున్నట్లు ఆమెకు తెలిపారు.

Also Read: Jaipur: పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!

ఇంటి సామాగ్రికి సంబంధించిన పార్శిల్ రాజమహేంద్రవరం నుంచి తులిసికి పంపించారు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి తులసికి ఫోన్ చేసి పార్శిల్ వచ్చినట్లు  చెప్పారు. ఓ ఆటో డ్రైవర్ ఈ పార్శిల్ తీసుకుని తులసి ఇంటికి వచ్చాడు.. ఆ పార్శిల్ తీసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఓపెన్ చేసి చూడగానే.. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనపడింది.

Also Read: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు

 దీంతో వారంతా షాకయ్యారు. వెంటనే ఆమె స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ పార్శిల్ రాజమహేంద్రవరం క్షత్రియ సంఘం పంపించినట్లు తెలియగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకు పిలిచి ఆరా తీస్తున్నారు.. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

Also Read: TTD: తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. మాజీ మంత్రిపై టీటీడీ కేసు నమోదు!

ఇదిలా ఉంటే.. ఆ పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని రాసి ఉంది. పార్శిల్‌‌లో బయటపడిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటాయని.. అది కూడా ఆ మృతదేహం సగ భాగం మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు