/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
Ap Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వాయుగుండంగా మారిన తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: New Virus: భయపెడుతున్న కొత్త వైరస్ డింగా డింగా..అసలేంటిది?
దీని ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.తీవ్ర అల్పపీడనం కారణంగా శనివారం రోజున విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి,సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, వైఎస్ఆర్ కడప జిల్లా, జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని కూర్మనాథ్ వెల్లడించారు.
Also Read: KIMS: శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..హెల్త్ బులెటిన్ విడుదల
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో గురువారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోపాలపట్నంలో ఓ చోట కాంపౌండ్ కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read: జహీర్ ఆ చిన్నారి బౌలింగ్ చూశావా.. వైరల్ వీడియో పోస్ట్ చేసిన సచిన్!
శనివారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలలో వర్షం కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచిస్తోంది. అలాగే పంటపొలాల్లో నీరు బయటకు వెళ్లిపోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది. వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఒడిశాపై పైనా అల్పపీడనం ప్రభావం ఉంది. అక్కడ కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.