MLC Ravindranath: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసిపి ఎమ్మెల్సీ తణుకు సమీపంలో తేతలివంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. వద్ద లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఇటీవల కాలంలో పలు విమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. శీతల గిడ్డంగిగా మాత్రమే దానికి అనుమతి ఉందని పంచాయితీ చెబుతుందని.. కానీ గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ గోవధ జరుగుతుందని స్ధానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు కవుల ప్రాంతంలో ఇలా... ఆ ప్రాంతం అంత తీవ్ర దుర్వాసన వస్తుందని స్ధానికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆదికవి నన్నయ్య యాగం చేసిన ప్రాంతం, తిలక్ వంటి కవులు అనేక మంది కవులు నడయాడిన ఈ ప్రాంతంలో పశువధ జరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు, ప్రజల మనోవేదన అర్దం చేసుకుని ఫ్యాక్టరీను ముసివేయాల్సిందిగా కోరుతున్నాను అని లేఖలో కోరారు. కాగా వైసీపీ ఎమ్మెల్సీ రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు! Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు Also Read: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!