/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
ap rains
Ap Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. ఏపీ,ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
Also Read: సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి
ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దాని మీద స్పష్టత లలేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని ,చలిగాలులు వీస్తున్నాయి.
Also Read: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!
దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.మంగళవారం విశాఖ, అనకపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పు,పశ్చిమ,కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం,మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
Also Read: Manu Bhaker: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్
బుధవారం తిరుపతి,నెల్లూరు, పొట్టిశ్రీరాములు, ప్రకాశం, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
Also Read: Robin Uthappa: పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ
రాష్ట్రంలోని కళింగపట్నం,విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాపట్నం, కృష్ణపట్నం సమా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రెండు, మూడు రోజుల అనంతరం బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నెల 26 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇలా వరుస అల్పపీడనాలు, తుఫాన్‌లో ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. గత నెల, ఈ నెలలో అల్పపీడనాలతో వరి రైతులు ఆందోళనలో ఉన్నారు. వర్షానికి ధాన్యం తడుస్తుందేమోనని భయపడుతున్నారు. అలాగే వరి పొలంలో పంట ఉండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు.
Follow Us