AP: పిఠాపురంలో TDP Vs జనసేన.. అలిగి వెళ్లిపోయిన వర్మ!

పిఠాపురం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. వేదిక మీద పవన్ కల్యాణ్ ఫోటో లేదని జనసేన...సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదంటూ టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వివాదంగా మారింది. 

author-image
By Manogna alamuru
New Update
ap

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఫోటో గొడవకు దారితీసింది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం సభ ఈరోజు అక్కడ జరిగింది. ఇందులో వేదిక మీద జనసేనాని పవన్ కల్యాణ్ ఫోటో పెట్టలేదు.  హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం ఏంటంటూ జనసేన కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకున్నారు.  పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తేనే గాని సమావేశాన్ని మొదలుపెట్టొద్దంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ మాత్రం జరగలేదు. గంట పాటూ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. 

అలిగి వెళ్ళిపోయిన వర్మ..

అయితే గంట తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటో వేదిక మీద ఏర్పాటు చేశారు. జనసైనికుల ఆవేశం చల్లారింది. కానీ అక్కడే ఉన్న టీడీపీ ఇంఛార్జ్ వర్మకు మాత్రం ఆగ్రహం తెప్పించింది. వేదిక మీద పవన్ కల్యాణ్ ఫటో పెట్టారు కానీ సీఎం చంద్రబాబు పెట్టలేదని ఆయన అలిగారు. దాంతో పాటూ అక్కడ ఉన్న ఫోటోను కూడా లాగిపడేయడంపై వర్మ మండిపడ్డారు. ఇదే కోపంలో వేదికపై నుండి దిగి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే వర్మ. హాస్పిటల్ మేనేజ్ మేంట్ ప్రోటోకాల్ ఉల్లంఘించి.. స్ధానిక ఎమ్మెల్యే హాస్పిటల్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయలేదని వర్మ ఆరోపించారు. 

దీని తరువాత మీటింగ్ గురించి టీడీపీ ఇంఛార్‌‌ వర్మ స్పందించారు. 30 పడకల హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా మార్చి నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నియోజక వర్గం ప్రజల తరుపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, సీఎం చంద్రబాబుకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా అన్నారు. అయితే హాస్పిటల్ డైరెక్టర్లుగా టిడిపి, జనసేన చెరో ఒక్క పదవికి ఎంపిక కాగా..ప్రమాణ స్వీకార రసాభాస కావడంతో జనసేన డైరెక్టర్ మాత్రమే చివరికి ప్రమాణ స్వీకారం చేశారు.

 

Also Read: Stock Market: 80వేల దిగువకు సెన్సెక్స్..మూడు లక్షల కోట్లు హుష్ కాకి..

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు