AP News: అయ్యో పాపం.. స్కూటీ పై వెళ్తుంటే చెట్టు విరిగి.. స్పాట్ డెడ్!
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పశ్చిమగోదావరి, ఏలూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
విశాఖపట్నం జిల్లా భీమిలీలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే ఔట్లో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు. మృతురాలి పూర్తి వివరాలు, హత్య వెనుక కారణాలు, నిందితుల గురించి త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.