Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ అగ్నిప్రమాదం: భారీ ఆస్తినష్టం..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ మారుస్తున్న సమయంలో పైప్ లైన్ లీకై కేబుల్స్‌పై పడటంతో మంటలు వ్యాపించాయి. సిబ్బంది వెంటనే గుర్తించి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు.

New Update
Vizag Steel Plant Fire Accident:

Vizag Steel Plant Fire Accident:

Vizag Steel Plant Fire Accident: ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం మళ్ళీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ - 2 (SMS-2) విభాగంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. వెంటనే అక్కడి ఉద్యోగులు, సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు.

ఈ ఘటన పై ప్లాంట్ ఉన్నతాధికారుల మాట్లాడుతూ,  "ఓ ఆయిల్ పైప్ లైన్ పగిలి పక్కనే ఉన్న కేబుల్స్ మీద ఆయిల్ పడటంతో ఈ మంటలు చెలరేగాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే గుర్తించి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి తక్షణమే వచ్చిన ఫైర్ టీమ్‌లు మంటలను నియంత్రించేందుకు  శ్రమిస్తున్నారు." అని చెప్పారు 

భారీ ఆస్తినష్టం..

అనుకోకుండా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే  భారీ ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి.

గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో తంటాలు పడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వార్షిక బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. ఇలాంటి సమయంలో మళ్లీ అగ్నిప్రమాదం జరగడం ప్లాంట్ కు తలనొప్పిగా మారింది.

అధికారులు, సాంకేతిక నిపుణులు ప్రమాదానికి గల అసలైన కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని ప్లాంట్ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు