BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!

సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

New Update
BREAKING

BREAKING

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. 

హిడ్మా మృతి

సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా  మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. భద్రతా బలగాలను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్టు హిడ్మాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.

ఏపీ, తెలంగాణ సరిహద్దులో జరిగిన ఈ ఎన్కౌంటర్లో  హిడ్మాతో పాటు ఆయన భార్య మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. కాగా హిడ్మాపై రూ. కోటికిపైగా రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉంది. వారం రోజుల క్రితమే హిడ్మా తల్లిని ఛత్తీస్ గడ్ హోంమంత్రి కలిశారు. మాడ్వి హిడ్మి ఆయన అసలు పేరు. 25 ఏళ్ల క్రితం హిడ్మా ఆడవుల్లోకి వెళ్లారు. ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అంటూ హిడ్మాను అతని తల్లి వేడుకుంది. 

ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని, మరికొంత మంది మావోయిస్టులు ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.  ఏపీ, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరింత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. 

మొత్తం 27 కేసులు

సుక్మా జిల్లా జేగురుగుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తి హిడ్మా స్వగ్రామం.. హిడ్మా అసలు పేరు సంతోష్, హిడ్మన్న. వయస్సు 55సంవత్సరాలు, ఎత్తు - 5.6. పదోతరగతి వరకు చదువుకున్నాడు.- హిందీ, కోయ భాషల్లో మాట్లాడుతాడు. మీడియం బెల్ట్ వినియోగిస్తాడు.. -  మావోయిస్టు పార్టీ అనుబంధ బాలలసంఘం నుంచి పార్టీలో చేరి అంచెలంచెలుగా హిడ్మా  ఎదిగాడు.ఆయనపై  కోటి రూపాయలు రివార్డ్ ఉంది. పీల్జీఏ ప్లాటూన్ -1 కమాండర్ గా, స్టేట్ మిలటరీ కమాండర్ గా హిడ్మా వ్యవహరిస్తున్నారు.  హిడ్మా నాయకత్వంలో 150 మంది కమాండర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో వలయాకారంలో హిడ్మాకు మూడంచెల భధ్రత ఉంది.  హిడ్మాకు పువర్తి, జేగురుగుండా, తెర్రం, గుండం, కోవరగట్ట, కొండపల్లి గ్రామాల్లో బలమైన నెట్ వర్క్ ఉంది.   హిడ్మా పేరిట మొత్తం 27 కేసులున్నాయి. 

Advertisment
తాజా కథనాలు