Viral Video: రిపోర్టర్‌పై బాలయ్య ఫైర్.. వీడియో వైరల్!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు నేడు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Balayya

Balayya

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు నేడు విశాఖపట్నం చేరుకున్నారు. అఖండ 2 మూవీ నుంచి పాటను రిలీజ్ చేయడానికి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కొందరు లేడీ ఫ్యాన్స్ బాలయ్య.. బాలయ్య అంటూ అరిచారు. వాళ్లతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. అయితే ఎందుకు సీరియస్ అయ్యారనే విషయం అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Rasha Thadani: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న రాశా థడానీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు!

పాట రిలీజ్ చేయడానికి..

ఇదిలా ఉండగా జగదాంబ థియేటర్‌లో 'అఖండ 2' సినిమాకు సంబంధించిన ఒక పాటను విడుదల చేయడానికి ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో వైజాగ్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బాలకృష్ణ, బోయపాటి శ్రీను బయలుదేరి.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు సింహాచలం బయలుదేరారు. ఆ తర్వాత జగదాంబ థియేటర్ వద్దకు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టులో బాలయ్య మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చూడండి: Raja Saab First Single: 'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. ఈసారైనా కన్ఫర్మా..?

Advertisment
తాజా కథనాలు