AP : ఏపీలో  పారిశ్రామిక, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) ఒక చారిత్రక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో  ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.

New Update
FotoJet (99)

Huge investments in industrial and clean energy sectors in AP

AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) గ్రూప్ ఒక చారిత్రక అడుగు వేసింది. విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు – 2025 లో ఎస్ఎస్‌ఈఎల్ గ్రూప్ తో పాటు దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంతో  ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నాయి. అ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలవనున్నట్లు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ గ్రూప్ పూర్తికాల డైరెక్టర్ వంశీ రెడ్డి నర్రెడ్డి మాట్లాడుతూ..“ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులు మాత్రమే కావు. ఇవి భారత స్వచ్ఛ ఇంధన రంగంలో మా దీర్ఘకాలిక విజన్‌కు బలమైన ప్రతిబింబం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపాంతరానికి, కొత్త ఉపాధి అవకాశాల సృష్టికి, ఆధునిక,సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇవి కీలకంగా మారనున్నాయి.”అని వివరించారు.

ఒప్పందాల వివరాలు:


ఒప్పందం    పెట్టుబడి విలువ    ప్రాజెక్ట్ వివరాలు
MoU – 1    ₹5,000 కోట్లు :   కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ విడిభాగాలు, విండ్ మాస్ట్ తయారీ మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు

MoU – 2    ₹23,450 కోట్లు :   రాష్ట్రవ్యాప్తంగా సోలార్, విండ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), డైరెక్ట్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, పవర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సెంటర్‌తో కూడిన సమీకృత స్వచ్ఛ ఇంధన మౌలిక వ్యవస్థ అభివృద్ధి

MoU – 3    ₹2,200 కోట్లు :   SPSR నెల్లూరు జిల్లా కరేడు లో 200 MLD సామర్థ్యంతో డీసాలినేషన్ ప్లాంట్, క్యాప్టివ్ జెట్టీ, బార్జ్ డాక్, రామాయపట్నం పోర్ట్ వద్ద షిప్పింగ్ బెర్త్ ,బాండెడ్ వేర్‌హౌస్ అభివృద్ధి

Advertisment
తాజా కథనాలు