/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Death
ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా కొర్లాంకు చెందిన సంపత్ కుమార్ (31)గా గుర్తించారు. వాళ్లకి అక్కడ సూసైడ్ నోట్ కూడా కనిపించింది. అందులో సారీ అమ్మా.. అనుకున్నది సాధించలేకపోయాను. ఎవరూ నా చావుకి కారణం కాదని రాసి ఉంది.
Also Read: యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో ఆ గేయాన్ని పాడాల్సిందే
ఇక వివరాల్లోకి వెళ్తే.. సంపత్ ఎంబీఏ వరకు చదివాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఉద్యోగం రాలేదు. అలాగే ఓ ఫైనాన్స్ సంస్థలో EMIతో ఓ బైక్ కూడా తీసుకున్నాడు. ఈ ఈఎంఐ చెల్లించలేక ఆందోళన చెందాడు. ఇటీవల ఆ సంస్థ సిబ్బంది సంపత్ బైక్‌ను కూడా తీసుకెళ్లాడు. దీంతో అతడు మనస్తాపానికి గురై సోమవారం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Follow Us