/rtv/media/media_files/2025/11/09/fotojet-2025-11-09t085557091-2025-11-09-09-02-39.jpg)
Master plan to kill aunt...How to kill an old lady?
Vishakapatnam : విశాఖలో దొంగపోలీస్, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు(Master Plan To Kill Aunt) విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. విశాఖ నగరంలోని 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్ట్‌మెంట్ ఎఫ్ బ్లాకులో జయంతి కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనను పోలీసులు చేధించారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం పెందుర్తి స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఏసీపీ పృథ్వితేజ, సీఐ సతీష్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,విశాఖ పెందుర్తిలోని అప్పన్నపాలెం నుంచి శుక్రవారం ఉదయం పెందుర్తి పోలీసు స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. వర్షిణి హోమ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో ఒక వృద్ధురాలు కాలిపోతున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. వెంటనే పెందుర్తి సీఐ సతీష్ కుమార్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 63 ఏళ్ల జయంతి కనకమహాలక్ష్మి అనే మహిళ కుర్చీలో విగతజీవిగా కనిపించారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసినట్లు ఆనవాళ్లు, అలాగే కళ్లకు గంతలు ఉన్నాయి."టీవీ షార్ట్ సర్య్యూట్ అవ్వడంతోనే మా అత్తగారు చనిపోయారు" అని తాము ప్రాథమికంగా విచారించినప్పుడు కోడలు లలిత చెప్పినట్లు పోలీసులు తెలిపారు."సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆ ఫ్లాట్‌లో కోడలు లలితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీవీ వైర్లు కాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ఉందని, ఆ కారణంగా మంటలు వచ్చాయని కోడలు లలిత చెప్పారు. మాకు సంఘటన స్థలంలో షార్ట్ సర్క్యూట్ ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు" అని ఏసీపీ పృధ్వీతేజ్ తెలిపారు."అత్త కనకమహాలక్ష్మి, పిల్లలు కళ్లకు గంతలు కట్టుకొని దొంగ-పోలీస్ ఆట ఆడుకున్నారని, అందులో భాగంగా అత్త కుర్చీలో కూర్చుండగా... ఆమె కాళ్లు, చేతులు కట్టారని, ఇంతలో టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కోడలు లలిత మాకు చెప్పారు"ఈ ప్రమాదంలో లలిత కూతురికి కూడా స్వల్ప గాయాలైనట్లు ఏసీపీ చెప్పారు."లలిత భర్త పౌరోహిత్యం చేస్తుంటారు. ప్రమాద విషయం తెలుసుకుని ఇంటికి వచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కోడలు లలితపై అనుమానం వచ్చింది. అని వివరించారు.
అయితే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అత్త చనిపోయిందని స్థానికులకు చెప్పిన లలిత, దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకుని కాలిపోయారని పోలీసులకు చెప్పడంతో మరింత అనుమానం రేకెత్తింది. కనకమహాలక్ష్మి కాలిపోతుండటాన్ని గమనించిన ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న వ్యక్తి మంటలు ఆర్పేందుకు రాగా లలిత అతణ్ని అడ్డుకున్నట్లు తేలింది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. శుక్రవారం రాత్రి వరకు లతితను పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించగా యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’ అని వెతికి, వీడియోలు చూసినట్లు గుర్తించారు. "లలిత ఫోన్ హిస్టరీని చెక్ చేయగా.. అందులో 'హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ' అనే సెర్చింగ్ పలుమార్లు కనిపించింది. ఆమెపై అనుమానం బలపడింది. ఆమెను విచారించినప్పుడు ఎట్టకేలకు రాత్రి 11.30 గంటలకు లలిత తాను చేసిన నేరాన్ని ఒప్పుకొంది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించడం, భర్తకు చాడీలు చెప్పడంతో జీర్ణించుకోలేక ఇలా చేశానని, క్షమించాలని ప్రాధేయపడింది.
Also Read : ఘోర విషాదం.. పిల్లలతో కలిసి తల్లి సూసైడ్
ప్లాన్ అమలు చేసిన తీరిది..
అత్త కనకమహాలక్ష్మిపై కక్ష పెంచుకున్న కోడలు లలిత ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీని కోసం యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’ అనే వీడియోలను పలుమార్లు చూసింది. ఈ నెల 6న సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై సింహాచలం సమీపంలోని గోశాల వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి రూ.100 పెట్రోల్ కొనుక్కుని తీసుకొచ్చారు. దాన్ని ఇంట్లో దాచింది. 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో భర్త బయటకు వెళ్లారు. ఇంట్లో కుమారుడు, కుమార్తె, లలిత తల్లి మాత్రమే ఉన్నారు. తల్లి స్నానం చేయడానికి బాత్‌రూంలోకి వెళ్లింది. ఆమె బయటకు వచ్చేలోపు అత్తను అంతమొందించాలని లలిత ప్లా్‌న్ చేసింది.
నిందితురాలు లలిత పోలీసుల దర్యాప్తులో "పిల్లలను అత్తగారితో దొంగ పోలీస్ ఆట ఆడుకోమని చెప్పాను. వాళ్లు ఆడుకుంటున్నారు. ఆటలో భాగంగా అత్త కళ్లకి గంతలు కట్టి, కాళ్లు, చేతులు కుర్చీకి కట్టించాను. ఆటలో భాగమని ఆమెతో అన్నాను" అని చెప్పారు. కళ్లకు, నోటికి గంతలు కట్టేసి మీరు దాక్కోండి అని పిల్లల్ని గదుల్లోకి పంపించింది. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. అత్త అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది.మంటలకు కనకమహాలక్ష్మి కాళ్లు, చేతులకు కట్టిన కట్లు కాలిపోయి విడిపోయాయి. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపు పరుగులు తీసింది. అక్కడే ఉన్న మనవరాలికి మంటలు అంటుకుని కాళ్లు, చేతులు కాలిపోయాయి. ఆ తర్వాత, అయ్యో మా అత్తగారు మంటల్లో కాలిపోతున్నారు, కాపాండండి, అంటూ కేకలు వేస్తూ పక్కింటి వాళ్లని పిలిచే ప్రయత్నం చేశారు". టీవీ వైర్లు తగిలి, నానమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది. కనకమహాలక్ష్మి కేకలు విన్న లలిత తల్లి బాత్‌రూంలో నుంచి బయటకు వచ్చి చూసేసరికే ఆమె విగతజీవిగా నేలపై పడి ఉంది. లలితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..
Follow Us