Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్‌.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు రూ.8 లక్షలకు కిడ్నీ ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.

New Update
kidney rocket

kidney rocket

ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన సూరిబాబు భార్య యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. పద్మ, సత్యలు మధ్యలో ఉండి కిడ్నీని రూ.8 లక్షలు ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆ కిడ్నీని గోవాను పంపిచేందుకు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తున్నారు. ఆ సమయంలో యమునకు ఫిట్స్ రావడంతో ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని తన భర్త సూరిబాబుకు చెప్పడంతో వెంటనే అతను తిరుపతికి వెళ్లాడు. అయితే యమున మృతదేహాన్ని వారు సీక్రెట్ ప్లేస్‌కు పంపించారు.

ఇది కూడా చూడండి: Maoists Encounter: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. ఛత్తీష్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్

విచారిస్తున్న పోలీసులు..

ఈ విషయాన్ని మధ్యవర్తులు చెప్పడంతో.. ఆమె మృతదేహాన్ని  చూడాలని భర్త అడిగాడు. దానికి వారు నిరాకరించడంతో సూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆసుపత్రి సిబ్బందితో పాటు మధ్యవర్తులుగా ఉన్న వారిని కూడా అరెస్టు చేశారు. అయితే గ్లోబల్ ఆసుపత్రికి, విశాఖకు చెందిన మధ్య వర్తులతో అసలు సంబంధం ఎలా ఏర్పడిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్లోబల్‌ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ ఆంజనేయులు కోడలు. ఇందులో ఆమె హస్తం కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Chennai : ప్యాంట్ జిప్ తీసి ప్రైవేటు పార్ట్ చూపించి.. అసభ్యంగా ప్రవర్తించిన బైకర్‌..  చితకబాదిన పారిశుద్ధ్య కార్మికురాలు!

Advertisment
తాజా కథనాలు