AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!
ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
విఫా తుపాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో బూడిద వర్షం కురిసింది. ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలా బూడిద పొడి వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బూడిద పొడి వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తుర్రవాడలో తల్లిదండ్రులపై కొడుకు ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వలేదని గొడ్డలితో వారిని నరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వంగలమడుగులో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భర్త జోగిదొర తన భార్య విజయకుమారి (39)ని కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
చెన్నైలోని మాధవరంలో పనిచేస్తున్న తిరుమల డెయిరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విశాఖపట్నానికి చెందిన బొలినేని నవీన్‌గా గుర్తించారు. రూ.40 కోట్ల నిధులు అక్రమంగా తన అకౌంట్లో వేసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించలేక ఇలా చేసినట్లు సమాచారం.
విశాఖ మాధవదారలో దారుణ హత్య జరిగింది. ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో లోహిత్ అనే యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే లోహిత్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోహిత్ మృతి చెందాడు.
విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలింది. షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదో రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.