/rtv/media/media_files/2026/02/22/vizag-1-2026-02-22-06-40-43.jpg)
Visakhapatnam: పెళ్లి బాజాలు( Marriage ) మోగిన ఆ పచ్చని పందిరిలో కాసేపటికే చావు కేకలు వినిపించాయి. అప్పటివరకు నవ్వుతూ అందరూ సందడి చేసిన ఆ ఇంట్లో విధి ఆడిన వింత నాటకానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. పెళ్లి వేడుక ముగిసి కొత్త జంట అత్తారింటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ), ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.
బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన ముత్యాల జగన్నాథరావుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. చిన్న కొడుకు మోహనకుమార్ (28) మాడుగుల మండలం ఎం.కోటపాడు సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు.
Also Read: ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!
అనకాపల్లి జిల్లాకు చెందిన ముత్యాల మోహన కుమార్‌కు, శ్రీకాకుళానికి చెందిన సునంద (22)తో శుక్రవారం రాత్రి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకలన్నీ ముగిశాక, శనివారం ఉదయం వధూవరులు కారులో శ్రీకాకుళం బయలుదేరారు. వీరితో పాటు వరుడి సోదరి లావణ్య, ఆమె భర్త మరికొందరు బంధువులు కూడా అదే కారులో ప్రయాణించారు.
Also Read: ఆరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ పూర్తి..ఆ రాష్ట్రంలో ఏకంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు
కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును
అయితే, వీరి ప్రయాణం కె.కోటపాడు సమీపంలోని బత్తినపాలెం పెట్రోల్ బంకు వద్దకు రాగానే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు సోదరి లావణ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. వరుడు మోహన కుమార్, లావణ్య భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: తగ్గేదేలే : ట్రంప్ రివర్స్ ఎటాక్.. సుంకాలు 15 శాతానికి పెంపు!
గతేడాదే పెళ్లయిన లావణ్య, తన అన్నయ్య పెళ్లి కోసం ఎంతో ఆశగా పుట్టింటికి వచ్చింది. తెల్లవారే వరకు అందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపిన ఆమె, అంతలోనే విగతజీవిగా మారడం చూసి బంధుమిత్రులు తట్టుకోలేకపోతున్నారు. లావణ్య తల్లి గుండెలవిసేలా ఏడుస్తూ సొమ్మసొల్లి పడిపోయారు. పెళ్లింట జరిగిన ఈ ఘోర విషాదం స్థానికులను కూడా కన్నీరు పెట్టించింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Follow Us