Mahesh Chandra Ladda: హిడ్మా మృతిపై అధికారిక ప్రకటన!

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.

New Update
Hidma

Hidma

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా(Mahesh Chandra Ladda) ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా(hidma naxal leader) మృతి చెందినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా అక్కడి నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి తమ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాలని చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ చీఫ్ తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచామన్నారు. రెండు రోజుల క్రితమే మావోయిస్టు నేతలు ఏపీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. హిడ్మాతో పాటు అతని భార్య, మరో నలుగురు మృతి చెందినట్లు మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Madvi Hidma : ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం.. ఎందుకు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ ?

Mahesh Chandra Ladda's Official Statement On Hidma's Death

ఇది కూడా చూడండి:  Vijayawada : విజయవాడలో మావోయిస్టుల కలకలం!

Advertisment
తాజా కథనాలు