/rtv/media/media_files/2025/12/01/fotojet-2025-12-01t130247624-2025-12-01-13-03-15.jpg)
Sky Walk In Vizag
Sky Walk In Vizag : పర్యాటకులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభూతిని అందించనుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు రానుంది. 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ పొడవు 55 మీటర్లు ఉంది. ఇది, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన మీద నుంచి సముద్ర అందాలు, తూర్పు కనుమలు, వైజాగ్ నగరాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంపోర్టెడ్ జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ స్కై వాక్‌వే పై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్(Project Skywalk Project) చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
Also Read: ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్ ఇదే!
కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని విశాఖపట్టణం ఎంపీ భరత్(mp-bharat), మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
Also Read: అందాల గేట్లు తెరిచిన 'కల్కి' బ్యూటీ.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..
విశాఖపట్నం కైలాసగిరిపై నిర్మించిన గాజు వంతెన 50 మీటర్ల పొడవైనది.
ఇప్పటివరకు కేరళలోని 40 మీటర్ల గాజు వంతెన పొడవైనదిగా ఉండేది. అయితే, కైలాసగిరి గాజు వంతెన దానిని అధిగమించింది.
గాజు గ్లాసు బ్రిడ్జిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేశారు.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి 40ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజు వినియోగించారు.
జర్మనీ నుంచి గాజు దిగుమతి చేసుకున్నారు.
ఒకేసారి 500 టన్నుల బరువును తట్టుకోగల సామర్థ్యం ఈ గాజు గ్లాసు బ్రిడ్జికి ఉంది.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ గ్లాస్ బ్రిడ్జి తట్టుకునేలా డిజైన్ చేశారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఇది తట్టుకోగలదు.
ఒకేసారి 40 మంది పర్యాటకులు ఎక్కి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
రాత్రివేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో ఈ వంతెన మెరిసిపోతుంది.
పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలుమార్లు పరిశీలించి, మార్పులు చేసిన తర్వాతే దీనిని ప్రారంభిస్తున్నారు.
వాస్తవానికి ఈ బ్రిడ్జిపైన ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉంది. కానీ భద్రత దృష్ట్యా కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు.
ఈ బ్రిడ్జిపైకి ఎక్కి చూస్తే ఆ చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, దూరంగా సముద్రం కనిపిస్తుంది.
ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే గాల్లో తేలియాడుతున్నట్లుగా.. అదేదో కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది.
నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ గ్లాస్ బ్రిడ్జి సరికొత్త థ్రిల్ అందించనుంది.
Follow Us