Big breaking : లోయలో పడిన ప్రైవేటు బస్సు.. స్పాట్‌లో 15 మంది!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది.

New Update
FotoJet - 2025-12-12T071952.736

Big breaking :  అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి లోని తులసిపాకల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణీకులు ఉన్నారు.

చిత్తూరు నుండి భద్రాచలం, అన్నవరం దేవస్థానాల దర్శనానికి పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరినట్లు తెలుస్తోంది. నిన్న భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకున్న ప్రయాణీకులు చింతూరు మీదుగా అర్ధ రాత్రి అన్నవరం బయలుదేరారు. బస్సు అర్థరాత్రి ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. లోయలో పడిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెంబర్ AP 39 UM 6543. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వీరంతా సీనియర్ సిటీజన్స గా తెలుస్తోంది. అంతా దైవ దర్శనానికి బయలు దేరారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలి వద్ద బాధితుల రోదనలు మిన్నంటాయి. రాజు గారి మెట్ట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ప్రయాణీకులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. బస్సు కూడా అదే జిల్లాకు చెందింది.బస్సు ప్రమాదంతో ఈ దారిలో భారీగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి...

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణీకులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు ముఖ్యమంత్రి తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు