Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత ఏం చేసిందంటే?

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు.

New Update
FotoJet (100)

Ramya-Nagaraju-Vasantharao

Wife Kills Husband పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం(extramarital-affair) చిచ్చుపెట్టింది.  ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య(wife-killed-her-husband) చేసింది. విశాఖ నగర శివారులోని పీఎంపాలెం పోలీసు స్టేషన్‌ సీఐ జి.బాలకృష్ణ(vishaka-police) వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకి చెందిన అల్లాడ నాగరాజు(39), రమ్య(36) భార్యభర్తలు. 8ఏళ్ల కిందట విశాఖ వచ్చి మధురవాడ దరి బి-2 కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగరాజు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతనికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన వసంతరావు(31)తో పరిచయం ఏర్పడింది. అతను కంచరపాలెం దరి ధర్మానగర్‌లో నివసిస్తున్నాడు. నాగరాజు ఇంటికి వసంతరావు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో రమ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొంతకాలానికి నాగరాజు గమనించాడు. భార్యను మందలించాడు కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు సరి కదా ! దీనికో పరిష్కారం వెతికింది. ప్రియుడు వసంతరావు తో కలిసి ఆ పరిష్కారాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది.. vishakapatnam-news

Also Read :  చనిపోయిన భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్.. విదేశీ కరెన్సీ కూడా

మాలధారణ మరిచి..

నేరస్తులు తమ నేరప్రవృత్తి అమలు చేయడానికి ఎలాంటి నిబంధనలు కూడా పాటించరు. చివరికి దేవుని భయం కూడా ఉండదని తాజా ఘటన నిరూపించింది. నాగరాజును చంపాలనుకుంటున్న వసంతరావు అయ్యప్ప మాట వేశాడు. ఆ సమయంలో  రాంబాబు, పండు అనే ఇద్దరు మాల ధారణ సమయంలో పరిచయం అయ్యారు. అప్పుడే రమ్య భర్త నాగరాజు విషయాన్ని వారికి వివరించాడు. అయితే మాల ధారణ సమయం ముగిసిన తర్వాత నాగరాజు విషయాన్ని పూర్తి చేయాలని ముగ్గురు నిర్ణయించారు. దానికోసం రమ్య, వసంతరావు వారికి రూ. 50 వేలు ఇచ్చారు.  

మందు తాగుదామని పిలిచి 

మాలధారణ ముగిసిన తర్వాత మద్యం అలవాటున్న నాగరాజు ను పథకం ప్రకారం మద్యం తాగుదామని వసంతరావు  పిలిపించాడు. అంతకుముందే వసంతరావు హోటల్లో గది బుక్ చేశాడు. అక్కడ మద్యం సేవించడానికి అందరూ కూర్చున్నారు. తీవ్రస్థాయిలో మద్యం తాగిన నాగరాజు మత్తులోకి వెళ్లిన సమయంలో ముఖానికి దిండు అడ్డంపెట్టి ఊపిరాడనికుండా చేసి చంపేశారు.. అనంతరం మృతదేహాన్ని హోటల్ గది నుంచి బైక్ పై నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి తీసకెళ్లి తిమ్మాపురం ప్రాంతంలో పడేసి వచ్చారు.

అనుమానం రాకుండా ఎన్నో జాగ్రత్తలు

అయితే నాగరాజును చంపాలనుకున్న రమ్య తో సహా నలుగురు నిందితులు పోలీసులకు పట్టు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా హత్య అనంతరం మృతదేహాన్ని తరలించే సమయంలో వాహనం గుర్తింపు లేకుండా రేంటెడ్ బైక్ ను తీసుకున్నారు. దానిపైన నాగరాజు మృతదేహాన్ని లాడ్జి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అది ఒకటే కాకుండా సహజంగా పోలీసులు ఇటీవల కాలంలో సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. దానికోసం హత్య జరిగిన రోజు ఒక రోజంతా ఇటు రమ్య అటు వసంతరావు ఫోన్ ఉపయోగించలేదు అనుమానం రాకుండా మొబైల్ విషయంలో జాగ్రత్తలు పాటించారు. నాగరాజు హత్య తర్వాత రమ్య పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త కనిపించడం లేదని, మద్యానికి బానిసైన అతను ఇంట్లో బంగారు ఆభరణాలను కూడా తీసుకుని వెళ్లిపోయినట్టు ఫిర్యాదు చేసింది.

Also Read :  మైన‌ర్ అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. జాతీయ షూటింగ్ కోచ్‌పై కేసు ఫైల్

ఆ తప్పే పట్టించింది

వివాహేతర సంబంధానికి ప్రధాన కారణం కోరిక. అదే నిందితులను పట్టించింది. రమ్య . వసంతరావు మధ్య వివాహేత్ర సంబంధానికి నాగరాజు అడ్డంగా వస్తున్నారని హత్య చేశారు. అయితే వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. కానీ వారిమధ్య ఉన్న అక్రమ సంబంధమే రమ్య తో తప్పు చేయించింది. నాగరాజుకోసం పోలీసులు విచారణ సాగిస్తున్న దశలో రమ్య, వసంతరావులు మరో గది తీసుకుని ఏకంగా కాపురం పెట్టారు. కాగా, రమ్యపై అనుమానం వచ్చిన పోలీసులు వారిద్దరు కదలికలపై నిఘా పెట్టారు. ఫోన్ కాల్ డేటా బట్టి విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితులు రమ్య, వసంతరావు,రాంబాబు, పండులను అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో నాగరాజు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు.

Advertisment
తాజా కథనాలు