ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు ఫైర్
రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వళ్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా అధికారులు ఆయన్ను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందంటున్న దాని చూసిన వారు చెబుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బూనేటి చాణక్య 2 తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దీంతో ఈకేసులో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ బ్లాక్ మనీతో చాణక్య సినిమాలు తీశాడా అని అనుమానం వ్యక్తమతుంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించి.. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.
మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు.