ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
chandrababu

AP News: రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. యాంటీ నార్కోటిక్స్‌ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో పాల్గొన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.  డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు.

Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !

‘రాష్ట్రంలో ముఠా కక్షలకు చోటులేదు. రాయలసీమలో ముఠాలను టీడీపీ అణచివేసింది. మతసామరస్యాన్ని కాపాడుతాం. విద్వేషాలు రెచ్చగొట్టేవారిని అణచివేస్తాం. గంజాయి బ్యాచ్‌కు సహకరించిన వారికి గుణపాఠం చెబుతాం. గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం బాధ్యతే కాదు.. అందరు కలిసి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ముందుకురావాలి. ప్రజల్ని మెప్పించి ఓట్లు వేయించుకోండి.. తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదు. 2021లో దేశంలో మొత్తం గంజాయి సాగులో 50శాతం ఏపీ, ఒడిశా నుంచే పండించారు. ఇవి విశాఖ కేంద్రంగా ఉండటం బాధ కలిగించింది ’అన్నారు. 

Advertisment
తాజా కథనాలు