/rtv/media/media_files/2025/02/16/7fucRmu5gFa1M9U4omhP.jpg)
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబునాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read : కేరళ కోజికోడ్ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు
YS Jagan Reaction Over Journalist Kommineni Srinivasarao Arrest
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2025
Also Read : లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా
ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగాను అరెస్టు చేశారన్నారు. ఈ చర్యతో కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారన్నారు.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి
కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్లేనన్నారు. అందులో ఏడాది గడిచిపోయిందన్నారు. నాలుగేళ్ల తర్వాత అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుందని.. అది రెండింతలవుతుందని మర్చిపోవద్దని హెచ్చరించారు.
Also Read : అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu breaking news | andhra-pradesh-politics
Follow Us