BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత
ప్రముఖ రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ విజయవాడలోని తన ఇంట్లో బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. కవి, సైనికుడు, న్యాయవాది అయిన కాటూరి ప్రస్తుతం ఏపీ హైకోర్టు, న్యాయవాదిగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.
ప్రముఖ రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ విజయవాడలోని తన ఇంట్లో బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. కవి, సైనికుడు, న్యాయవాది అయిన కాటూరి ప్రస్తుతం ఏపీ హైకోర్టు, న్యాయవాదిగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.
పెన్షన్ దారులకు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో 3.5 లక్షల మందిని అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వీరి పెన్షన్ రద్దు చేసేందుకు లిస్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
విజయవాడలో ఓ యువతి లెస్బియన్తో సహజీవనం చేయడంతో ఆమె తండ్రి అక్రమంగా నిర్భందించాడు. దీంతో లెస్బియన్ భాగస్వామి కోర్టును ఆశ్రయించగా లెస్బియన్స్తో సహజీవనం చట్టబద్ధమేనని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. మేజర్ యువతి విషయంలో తండ్రి జోక్యం చేసుకోవద్దని తెలిపింది.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ పథకం అమలు చేయనుంది.
ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం కావడం వెనుక వాలంటీర్ల హస్తముందని డిప్యూటీ సీఎం పవన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ లాయర్, జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు.
ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించింది.
రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి కాగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు.