AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు కేసులో ఆ ఫైల్స్ ఏ కీలకంగా అధికారులు భావిస్తుండగా ప్రస్తుతం ఆ ఫైల్స్ మాయం కావడం సంచలనం రేపుతోంది. అయితే అప్పటి ఫైబర్ నెట్ ఉద్యోగిని ఆఫైల్స్ ను విజయసాయి రెడ్డికి అప్పగించినట్లు చెప్పగా.. ఫైల్స్ అప్పగించిన ఉద్యోగిని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సహోదరిగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శాంతి, ఆమె సోదరిని అడ్డంపెట్టి దేవాదాయశాఖలో ఫైబర్ నెట్ లు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఇందులో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. ఇక ప్రభుత్వం మారిన వెంటనే శాంతి సోదరిని ఉద్యోగం నుండి తొలగించిన అధికారులు.. ఆ ఫైల్స్ ఎలా మాయమాయ్యాయి అనే దానిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. Also Read: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం ఏ25గా చంద్రబాబు.. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.114 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ కు న్యాయస్థానం సానుకూలంగా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ11గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ప్రమీల, ఏ25గా చంద్రబాబు పేర్లు నమోదు చేశారు. అలాగే ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది. నిందితులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించామని, వాటిని అటాచ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తన పిటిషన్ లో వెల్లడించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం కాగా ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న విచారణ జరిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబును ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. Also Read: విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఆ ఫైళ్లు మిస్సింగ్! ఇది కూడా చదవండి: పెళ్ళైన మూడో రోజే.. మెడలో తాళి బొట్టుతో ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్, వీడియో వైరల్