/rtv/media/media_files/2024/11/05/HaG1FxcRLeFJgZLJt01e.jpg)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మహిళా వాలంటీర్లు షాక్ ఇచ్చారు. గతంలో మహిళా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రముఖ లాయర్, జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. అధికారం చేతులో ఉందని కేసులు కొట్టేవేయడం కోర్టుకు వ్యతిరేకమన్నారు.
ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా
మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం..
వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. వీరి వెనుక వాలంటీర్ల హస్తముందని ఎన్నికల ప్రచారంలో పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా అదృశ్యమైన వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి మహిళా వాలంటీర్లు సాయం చేశారని ఆరోపించారు. దీంతో ఆగ్రహం అయిన గత వైసీపీ ప్రభుత్వం పవన్‌పై కేసు నమోదు చేయడంతో పాటు జీవో కూడా జారీ చేసింది.
ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా
అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం
ఈ ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేయడంతో.. గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లో గత వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసి సమన్లు కూడా జారీ చేసింది. కానీ ఎలాంటి కారణం చూపించకుండానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును విత్ డ్రా చేసుకుంది. కూటమి ప్రభుత్వం పవన్‌పై కేసు ఉపసంహరించుకోవడంతో ఇద్దరు మహిళా వాలంటీర్లు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారం చేతులో ఉందని కారణం లేకుండా కేసు ఇలా ఉపసంహరించుకోవడంతో మళ్లీ హైకోర్టును మహిళా వాలంటీర్లు సంప్రదించారు. రేపు హైకోర్టులో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్
ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!