ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్.. మెడకు ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ

ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించింది.

New Update
IPS Sanjay

సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్‌.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది.

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

ఎన్వీసీలు జారీ చేసే సమయంలో నిధులు దుర్వినియోగం..

అనుమతి కోసం ఏసీబీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అనుమతి వస్తే వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ఎన్వీసీలు జారీ చేయడానికి అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్ట్‌ను సంజయ్‌కు అప్పగించారు. 

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

ఎలాంటి పనులు జరగకపోయిన కూడా రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించారు. అలాగే గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి దాదాపుగా రూ.1.19 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ సదస్సులు అన్ని కూడా సీఐడీ అధికారులే నియమించారు. కానీ క్రిత్వ్యాప్ సంస్థకు డబ్బులు చెల్లించారు. ఇలా దాదాపుగా రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. అందుకే అతనిపై కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఇలా నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే క్రిత్వ్యాప్ సంస్థ కూడా ఫేక్ అని కూడా విచారణలో తేలింది. మరి దీన్ని ఎవరు స్థాపించారు? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అసలు కంపెనీ లేదు కానీ డబ్బులు మాత్రం ట్రాన్సక్షన్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు ఏసీబీ సేకరించనుంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు