ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచే ఉచిత భోజనం

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ పథకం అమలు చేయనుంది.

New Update
ap-govt-jpg

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల వలె ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. కొందరు అయితే ఎంతో దూరం నుంచి వస్తుంటారు.

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..

ఫుడ్ ప్రిపేర్ సమయంలో కొందరు బస్సు మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు కాలేజీకి ఆలస్యం అవుతుందని బాక్స్ తీసుకెళ్లరు. దీంతో మళ్లీ రాత్రి వరకు ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఇలా మధ్యాహ్న సమయం భోజనం కోసం పడుతున్న ఇబ్బందులకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనుంది.

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

అలాగే విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపాన్ని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో విద్యార్థులు పోషకాలు ఉండే ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ చదువు మీద ఇంట్రెస్ట్‌తో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇంటర్ కాలేజీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు సంచులు వంటివి కూడా పంపిణీ చేసింది. అలాగే సంకల్ప్ పేరుతో కేర్ టేకర్లను నియమించి ప్రత్యేకంగా క్లాస్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు