AP: పెన్షన్ దారులకు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో 3.5 లక్షల మందిని అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వీరందరి పెన్షన్ రద్దు చేసేందుకు లిస్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 3.50 లక్షల మంది.. ఈ మేరకు అనర్హుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ సర్వే నిర్వహించగా పలు గ్రామాల్లో 563 మందికి పైగా అనర్హులకు పెన్షన్ అందుతున్నట్లు తేలింది. దీంతో వెంటనే అనర్హుల పెన్షన్లు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల లాగిన్ నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే అకస్మాత్తుగా నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోవాలని, లబ్ధిదారులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా అనిపిస్తే పింఛన్ కంటిన్యూ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సౌత్ ఇండియన్స్‌కు ఉద్యోగాలివ్వం.. నార్త్ కంపెనీ వివాదాస్పద యాడ్! ఇక పకడ్బందీగా పింఛన్ల లిస్టును తయారు చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సెర్ప్ సీఈవో వీరపాండ్యన్ సూచించారు. నోటీసులకు సకాలంలో సమాధానాలు ఇవ్వలేకపోతే పెన్షన్లను హోల్డ్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది దాకా అనర్హులున్నట్లు భావిస్తుండగా.. అన్ని సచివాలయాల పరిధిలో సర్వే చేసి అనర్హుల పెన్షన్లను తొలగించాలని వీరపాండ్యన్ స్పష్టం చేశారు. తప్పుడు సదరం సర్టిఫికెట్లు, డాక్టర్ల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యల పేరుతో పెన్షన్లను పొందుతున్నట్లు గుర్తించామని చెప్పారు. అలాంటి వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇదే విషయంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దొడ్డిదారిలో పెన్షన్ పొందుతున్న వారిని తొలగించి, అసలైన లబ్ధిదారులకు ఇబ్బందిపడకుండా చూడాలని ఆదేశించారు.