ప్రముఖ రచయిత, కవి, సైనికుడు, న్యాయవాది అయిన కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ కన్నుమూశారు. విజయవాడ కృష్ణలంకలోని ఇంట్లో బుధవారం వేకువ జామున గుండె పోటుతో మరణించారు. ఇతనికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1944లో పుట్టిన కాటూరి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఉన్నతవిద్యను పూర్తి చేసి.. 1963లో వైమానిక దళంలో చేరారు.
ఇది కూడా చూడండి: 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!?
ప్రముఖ కథా రచయిత, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవ సలహాదారులు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ఈ రోజు తెల్లవారు ఝామున మరణించారు.
— సాహిత్య వార్త (@KuriseVaana) December 18, 2024
ఇవాళే ఆయన జన్మదినం కూడా. pic.twitter.com/KBISUyKYaS
ఇది కూడా చూడండి: నాకు ఆ టైమ్ వచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ ఎమోషనల్!
వైమానిక దశంలో 16 ఏళ్ల పాటు సేవలు అందించి..
ఒక 16ఏళ్ల పాటు వైమానిక దళంలో సేవలు అందించి ఆ తర్వాత ఓ బ్యాంకులో పనిచేశారు. ప్రస్తుతం కాటూరి ఏపీ హైకోర్టు, న్యాయవాదిగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. అలాగే జాతీయస్థాయి వినియోగదారుల ఫెడరేషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: బ్లాక్ చీరలో హాట్ బాంబ్‌లా రష్మిక.. నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ!
దాదాపు 600కు పైగా..
చిన్నతనం నుంచే కాటూరికి నవలలు, రచనలపై ఆసక్తి ఉండేది. దీంతో 11 ఏళ్లు ఉన్నప్పటి నుంచే కథలు రాయడం ప్రారంభించారు. ఈయన రాసిన మొదటి కథ 1974లో ప్రచురితమైంది. ఇప్పటివరకు దాదాపు 600కు పైగా కథానికలు కాటూరి రచించారు. కాటూరి కథానిక, నాటిక, నాటకం, నవలిక, నవల, గీతాలు, హరికథలు ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషి చేశారు. ఈయన రచించిన వందకు పైగా నాటకాలు విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
ఇది కూడా చూడండి: చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!