తల్లిదండ్రులు అమ్మాయిలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఒక వయస్సు వచ్చాక వారిని పెళ్లి ఒక ఇంటికి పంపించాలని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు తల్లిదండ్రులకు షాక్ ఇస్తూ.. లెస్బియన్స్‌గా మారుతున్నారు. వాళ్ల శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఇలా మారుతున్నారో లేకపోతే అబ్బాయిలు మీద విరక్తి వచ్చి మారుతున్నారో తెలియదు. అయితే ఇటీవల ఏపీ హైకోర్టులో ఇలాంటి ఓ కేసు దాఖలైంది. ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్ తండ్రి అక్రమంగా నిర్భంధించాడని.. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటున్న ఓ యువతి లెస్బియన్ భాగస్వామితో సహజీవనం చేస్తోంది. ఇది నచ్చని ఆ యువతి తండ్రి ఆమెను నిర్భంధించాడు. దీంతో ఆ లెస్బియన్ భాగస్వామి ఆ తండ్రి అక్రమంగా ఆమెను నిర్భంధించాడని.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఓ సీనియర్ లాయర్ జడ శ్రావణ్ కుమార్ ఆ యువతి తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ లెస్బియన్స్ రిలేషన్ చట్టబద్ధమేనని, మేజర్ అయిన యువతిని తండ్రి నిర్భంధించడం చట్ట విరుద్ధమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఆ తండ్రి ఉన్న ప్రాంతానికి నోటీసులు పంపించింది. కానీ ఎవరూ అక్కడ లేకపోవడంతో అవి తిరిగి వచ్చాయి. దీంతో కోర్టు ఆ యువతిని ధర్మాసనం ముందు హాజరు పరచాలని ఆదేశించింది. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు ఈ క్రమంలో న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడి ఇలా తీర్పునిచ్చారు. లెస్బియన్‌తో సహజీవనం చేయడం చట్టబద్ధమే.. ఆ యువతి కూడా మేజర్.. తనకి నచ్చిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. ఆ యువతి విషయంలో తండ్రి ఎలాంటి జోక్యం చేసుకోకూడదని తెలిపింది. ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు