AP News: చిరుతలు ఎంత ప్రమాదాలకు గురి చేస్తాయో తెలిసిందే. ఒక్కసారి పులి ఊరిలోకి వచ్చినా.. దాని ఆడుగులు కనిపించినా ఎంతో భయ పడుతుంటారు. తాజా ఓ రైతు పొలం కోసం పెట్టిన ఉచ్చు పడి చిరుత మృతి చెందిది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. మెట్లపల్లిలో గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు చేశాడు. ప్రమాదవశాత్తు ఆ ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మరణించింది. గురువారం ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి అక్కడి కనిపించింది. ఉచ్చులో చిక్కుకొని.. ఇది చూసిన రైతులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో మెట్లపల్లి చుట్టుపక్కల ప్రాతంతో చిరుతపులి సంచరిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఉచ్చులో చిక్కి మరణించడంతో సమీప అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సింగిల్ గా బయటకు, పొలాల్లోకి వెళ్లొద్దని గ్రామస్థులు నిర్ణయించుకుంటున్నారు. ఇది కూడా చదవండి: భద్రాద్రి లడ్డూ నెయ్యిపై వివాదం..ఆలయ ఈవోకు మంత్రి సురేఖ వార్నింగ్! చిరుత పులి మృతి చెందిన ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిరుత కళేబరాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామి ఇచ్చారు. చిరుత మృతితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తర్వలోనే చిరుతల సంచారంపై నిఘా ఏర్పాటు చేసి చిరుతలు ఉన్నయో లేవో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు! ఇది కూడా చదవండి: ముఖానికి కాఫీ పౌడర్ రాస్తే జరిగే అద్భుతం ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో పండే ఆడ వెల్లుల్లి గురించి తెలుసా?