BREAKING: 'అఘోరిని తన్ని తరిమి కొట్టండి'
ఆంధ్రకు నాలుగు సంవత్సరాల తర్వాత గోవింద నంద సరస్వతి స్వామీజీ వచ్చారు. నకిలీ అఘోరీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్న నకిలీ అఘోరీలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కోరారు.
ఆంధ్రకు నాలుగు సంవత్సరాల తర్వాత గోవింద నంద సరస్వతి స్వామీజీ వచ్చారు. నకిలీ అఘోరీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ప్రజలను భయప్రాంతులు గురి చేస్తున్న నకిలీ అఘోరీలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కోరారు.
ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడుగా ఉన్న అడిషనల్ డీఎస్పీ విజయపాల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెను ప్రమాదం తప్పింది. ఓ హాస్పటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే.. లిఫ్ట్ మొరాయించడంతో అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. అతికష్టం మీద ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యేను బయటకు తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం కరడవలసలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఆమె డోలీ మోతలకు స్వస్తి పలికబోతున్నట్లు చెప్పారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.
చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. 3 టీమ్ లు కుట్రకు పాల్పడ్డాయని ఏసీపీ తిలక్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి.
సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పక్కా ప్లాన్ ప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబుపై రాళ్ళ దాడి జరిగినట్లు నందిగామ ఎసీపీ A.B.G తిలక్ తెలిపారు. సాయంత్రం 6:30లకు కరెంటు తీసి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో 17 మంది నిందితులకు నోటీసులు ఇచ్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.