ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతి లో దారుణం..ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్వేర్! తిరుపతిలోని పద్మావతి నగర్ లో దారుణం జరిగింది.వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు మోహన్ అనే సాఫ్ట్వేర్ మరిది.అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా! తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneshwari : అవసరమైతే చంద్రబాబుతోనే పోరాడతాను : నారా భువనేశ్వరి! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే? తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య ధనలక్ష్మి తన ప్రియుడి హరితో కలిసి భర్త నరేష్‌ను చంపేసింది. అర్థరాత్రి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి, తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శన టికెట్లు విడుదల ఇవాళ ఆన్లైన్లో అక్టోబర్ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీని వదలని మిస్టర్ వరుణ్... మంగళవారం కూడా ఈ జిల్లాల్లో వానలే వానలు! ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన! మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏనుగులు హల్ చల్.. 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను.. చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రూ. 2 లక్షల నష్టం వచ్చిందని వాపోతున్నాడు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం! చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలోపోయింది. ఆఫీసు లోపల కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn