AP crime : చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ఇద్దరు మృతి..మరో ముగ్గురికి గాయాలు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై హెరిజేజ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరేగౌడ, నూతన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు (మంజునాథ, సౌమ్య, శాంతమ్మ) తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Road Accident

Road Accident

AP crime : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై హెరిజేజ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని లగేరి ప్రాంతానికి చెందిన వారు తిరుమల దర్శనానికి బయలుదేరారు.  

Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

వారు ప్రయాణిస్తున్న కారు.. చంద్రగిరి మండలం కాశిపెంట వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరేగౌడ(60), నూతన్‌(6) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు (మంజునాథ, సౌమ్య, శాంతమ్మ) తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

కాగా ఇటీవల తిరుపతికి వెళ్లే క్రమంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితమే కారు కంటైనర్ కిందకు దూసుకుపోవడంతో ఐదుగురు మరణించిన సంఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే అనుమతికి మించి మితిమీరిన వేగంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లే క్రమంలో కారును అదుపు చేయలేకపోవడంతో అవి అదుపుతప్పుతున్నాయని, లేదంటే ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయని పోలీసులు తెలుపు తున్నారు.  తిరుపతికి వాహనాల్లో వచ్చేవారు జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచిస్తున్నారు.

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు