/rtv/media/media_files/2025/05/01/JCNb3geVUe4rewMV3MZK.jpg)
tirupathi crime news
AP Crime: తిరుపతి జిల్లాలోని దామలచెరువు గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన ఎస్. అశోక్ కుమార్(52) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. గురువారం 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అశోక్ కుమార్ గ్రామంలో మంచి పేరు పొందిన వ్యక్తిగా, ఆతని జీవనోపాధి మెడికల్ షాప్ నిర్వహణతో పాటు మామిడి కాయల వ్యాపారం కూడా ఉంది.
దాడిలో తీవ్ర గాయాలవలె..
రోజువారీ కార్యకలాపాల్లో ఉన్న సమయంలోనే దుండగులు ఎస్. అశోక్ కుమార్‌పై దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్ర గాయాలవలె ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం దుండగులు ఆయన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దాడి వెనక దోపిడీ కోణం ఉన్నదా..? లేక ఇతర వ్యక్తిగత కారణమా అన్నది తెలియాల్సి ఉంది. స్థానికులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి పంపించారు. దీనితో పాటు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఐస్ ముక్కలు తింటున్నారా.. మీకు ఐరన్ లోపం ఉన్నట్టే
ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, వ్యాపార సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.గ్రామంలో ఈ హత్య స్థానికుల్లో ఆందోళన రేపింది. నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు, త్వరలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొనగా, న్యాయం కోసం బాధిత కుటుంబం ఎదురుచూస్తోంది.
ఇది కూడా చదవండి: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
( ap crime updates | ap-crime-news | ap crime latest updates | ap-crime-report | latest-news )