/rtv/media/media_files/2025/04/28/xABYwDyECkqVCMmVsU8h.jpg)
Tirupati Road Accident
Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్‌గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!
కాగా మృతులంతా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది. మొత్తం ఏడుగురు భక్తులు కారులో తిరుమలకు బయలుదేరాగా పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీట్టింది. దీంతో కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధుడు, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?
కారులో ఉన్నవారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో వెంటనే దాన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్నవారు చనిపోయినట్లు ధృవీకరించారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కారు అధిక స్పీడుతో ఉండటం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.