BIG BREAKING: తిరుపతిలో మరో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్!

తిరుపతి నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగురు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మంగళంలోని తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్నహెచ్ఐజీ భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

New Update
ACCIDENT

ACCIDENT

BIG BREAKING:  తిరుపతి నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగురు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.మంగళం లోని తుడా క్వార్టర్స్‌లో హెచ్ఐజీ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే, ఇవాళ  బిల్డింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడిపోయారు. దీంతో తీవ్ర గాయలైన వారు స్పాట్‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. 

ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

వివరాల ప్రకారం..మంగళం తుడా క్వాటర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భావన నిర్మాణ కార్మికులు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కర్రలపై నిలబడి పనిచేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. సెంట్రింగ్ పనిచేయడానికి అనువుగా ఏర్పాటు చేసిన కర్రలు పక్కకు ఒరగడంతో పనిచేస్తున్న ముగ్గురు  జారి కిందపడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

ఇది కూడా చూడండి:Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డ మరో వ్యక్తి తెలియజేసిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.   ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మృతులను బోటతొట్టి శ్రీనివాసులు, వసంత, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు