BREAKING: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.