YCPకి దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు!

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని YCP దాఖలు చేసిన పిటిషన్‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది.

New Update
AP BREAKING NEWS

AP BREAKING NEWS

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో YCPకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. రెండు ZPTC స్థానాల్లోనూ పరాభవం చెందగా.. మరోవైపు రీపోలింగ్ నిర్వహించాలని YCP దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో (పోలింగ్ స్టేషన్ నెం. 3, 14) రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ రీపోలింగ్‌కు వైసీపీ నిరసనగా దూరంగా ఉన్నప్పటికీ, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ అభ్యర్థుల తరపున దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు దొంగ ఓట్లను వేయించారని, పోలీసులు అధికార పార్టీకి సహకరించారని ఆరోపించారు.

అయితే, వైసీపీ తరపున దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రీపోలింగ్ అవసరమైన పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, అదనపు చర్యలకు ఆదేశించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, వైసీపీ పిటిషన్‌ను కొట్టివేసింది.

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో YCPకి ఘోర పరాభవం ఎదురైంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. YCP అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్‌ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Advertisment
తాజా కథనాలు