Ambati Rambabu: పులివెందుల ఎన్నికపై ఫేక్ వీడియో.. అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్?

ఏపీ ఎన్నికలకు సంబంధించి అంబటి రాంబాబు పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన అంబటిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.

New Update
AP Fact Check

పులివెందుల ఎన్నిక(Pulivendula By Election) కు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) చేసిన పోస్టు వివాదస్పదమైంది. ఈ రోజు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన తన X ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి అనేక ఓట్లు వేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ''ఈ ZPTC ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ IPS కి అంకింతం !'' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు అంబటి. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది.  ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారన్నట్లుగా అంబటి రాంబాబు తన X ఖాతాలో పోస్ట్ చేశారన్నారు.

Also Read :  అనకాపల్లిలో అమానుషం.. గర్భిణిని చంపి.. శవాన్ని కాల్చి..!

AP Police May File Case On Ambati Rambabu

అయితే.. అంబటి పోస్ట్ చేసిన వీడియో అసలు ఈ రాష్ట్రానికే సంబంధించినది కాదన్నారు. అది 2023 జులైలో పశ్చిమబెంగాల్   రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వీడియో అని అన్నారు. అప్పట్లో ఈ వీడియోను సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేశారన్నారు. ఇప్పుడు ఆ వీడియోను పోస్ట్ చేసి డీఐజీ స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు ఇలాంటి పోస్ట్ చేయడం సరికాదన్నారు. పోస్ట్ చేయడం... ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత  ఆరోపణ చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుందన్నారు.

ఇలాంటి ఫేక్ ప్రచారం చేసే వ్యక్తులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయో.. అలాంటి చర్యలే అంబటి రాంబాబు మీద కూడా ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో అంబటి రాంబాబుపై చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందని ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. టీడీపీ తరఫున బరిలో నిలిచిన బీటెక్ రవి సతీమణి లతారెడ్డి 6 వేలకు పైగా  ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడి విజయం సాధించారని వైసీపీ ఆరోపిస్తుండగా.. పులివెందులలో మార్పు మొదలైందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Also Read :  YCPకి దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు!

latest-telugu-news | telugu-news | ambati-rambabu | andhra-pradesh-news | andhra-pradesh-politics

Advertisment
తాజా కథనాలు