/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
కడప జిల్లాలో ఖాళీ అయిన కార్పొరేషన్ మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కడపలో 22, 48 వార్డుల్లో మైదుకూరులో 5వ వార్డు, జమ్మలమడుగులో 4 వవార్డు, పులివెందులలో 23వ వార్డు, బద్వేలులో 11, 30 వార్డుల్లో, కమలాపురంలో 8, 20 వార్డుల్లో, రాయచోటిలో 19, 30 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా వార్డుల స్థానాలకు ఎన్నిక జరుపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అయితే.. మరోసారి పులివెందుల లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.